calender_icon.png 25 December, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

13-09-2024 12:06:15 PM

మంటలు ఆర్పిన కుకునూరుపల్లి పోలీసులు

పోలీసులకు అభినందనలు తెలిపిన సీపీ,  ప్రయాణికులు

కొండపాక: ఆర్టీసీ బస్సులో మంటలు వచ్చిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెదినీపూర్ బస్సు స్టేజ్ వద్ద  శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ డిపోకు చెందిన  బస్సు నెంబర్ టీఎస్ 09 జడ్ - 7645 కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళుచున్న క్రమంలో మెదినీపూర్ బస్సు స్టేజ్ వరకు చేరుకున్న బస్సులో ఒక్క సారిగా ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు, పొగలు వస్తున్నాయని డయల్ 100 కాల్ ద్వారా  సమాచారం రావడంతో  సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులందరిని కిందికి దిగమని తెలపగానే అందరూ కిందికి దిగినారు.

ఇంజన్లో నుండి మంటలు, పొగలు వస్తుండగా వెంటనే నీళ్లు తెప్పించి మంటలు ఆర్పివేశామని కుకునూరుపల్లి ఎస్ఐ  శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించి మంటలు ఆర్పిన  కుకునూరు పల్లి పోలీసులను ప్రయాణికులు అభినందించారు. కుకునూరుపల్లి పోలీసులు  హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించినందుకు  ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి, సిబ్బంది శేఖర్, శ్రీనివాస్, రాకేష్, వంశీలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించారు.