calender_icon.png 26 January, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

25-01-2025 02:13:28 PM

భారీగా ఎగిసిపడిన మంటలు  

అత్తాపూర్ హైదర్ గూడ ఎలక్ట్రికల్ బైక్ షోరూం లో ప్రమాదం

కోటి రూపాయల ఆస్తి నష్టం 

రాజేంద్రనగర్: ఎలక్ట్రికల్ బైక్ షోరూం లో భారీ అగ్ని(Fire Broke Out) ప్రమాదం జరిగింది. 45 ఎలక్ట్రికల్ వాహనాలు పూర్తిగా కాలిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని హైదర్గూడ శనివారం జరిగింది. స్థానికులు, షోరూం యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ గూడ లోని ఎర్రబోడ ప్రాంతంలో గత ఎడాది నూతనంగా ఎలక్ట్రికల్ బైక్ షొ రుమ్ ప్రారంభించారు. ఇలా ఉండగా శనివారం ఉదయం షో రూమ్ లో 45 ఎలక్ట్రికల్ వాహనాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి కాలిపోయాయి. క్షణాల్లో మంటలు దట్టమైన పొగలతో భారీగా వ్యాపించాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు పరుగులు తీశారు. షోరూం పైన అపార్ట్మెంట్లో ఉన్న రెండు రెండు కుటుంబాలు కూడా తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్రభయాందోలంతో డయల్ 100 తో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సుమారు ఒక గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బైక్ షోరూం( Electric Bike Showroom) యజమానులు లబోదిబోమన్నారు. ఉదయం పూజ చేసి బయటకు వచ్చే లోపే బైక్స్ బ్లాస్ట్ అయ్యాయి. అయితే వాహనాలు బ్లాస్ట్ అయ్యాయా లేదంటే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందో తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.