బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చె లరేగాయి. ఈ మంటల్లో ఆసుపత్రికి సంబంధించిన సామాగ్రితో పాటు కర్ర ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. హుటా హుటిన బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఆర్పి వేయడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం ఇది రెండవసారి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న శాశ్వత చర్యలు తీసుకోకపోవడం పట్ల వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.