calender_icon.png 23 December, 2024 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు

23-12-2024 01:18:58 AM

గద్వాల రైల్వే స్టేషన్‌లో నిలిపివేత 

గద్వాల, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి చెన్నైకి బయలుదేరిన చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు రావడంతో గద్వాల రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఆదివారం కాచిగూడ నుంచి చెన్నై బయలుదేరిన రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలులోని ఏసీ 3 టైర్ కోచ్ నంబర్ బీ4 లో పొగలు అలుముకున్నాయి.

ఈ ఘటనతో రైతులు గద్వాల స్టేషన్‌లో నిలిపివేశారు. మంటలు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ప్రయాణికులను బోగిల నుంచి దింపారు. దాదాపు గంట పాటు రైల్వే అధికారులు శ్రమించి సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిదిద్దడంతో గద్వాల నుంచి చెన్నైకి రైలు ప్రారంభం అయ్యింది.