17-04-2025 01:37:53 AM
ఏర్గట్ల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామ శివారులో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. గీతా కార్మికులకు చెందిన ఇత వనం చెట్లు దగ్ధం అయ్యాయి. ఈత వనంలో కాపలాగా ఉన్న వ్యక్తి భోజనాని వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈత వనంలో మంటలు చెలరేగాయి దింతో గౌడ సంఘ సభ్యులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా వీడీసీ సభ్యులు గౌడ సామాజిక వర్గ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు.
పండగ పర్వదినాల్లో వారిని మందిరాల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. పరిస్థితి ఉధృతంగా ఉన్న సందర్భంలో ఈత వనాలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముమ్మాటికి గ్రామాభివృద్ధి కమిటీ దుశ్చర్యనేఅని వారు ఆరోపిస్తున్నారు.
గౌడ సంఘం సభ్యులు ఈత వనం వద్దకు చేరుకొని మంటలను నీటితో ఆర్పీ వేసే వ్యక్తం చేసినప్పటికిని ఫలితం లేకుండా పోయింది. ఈ దగ్ధంతో గీత కార్మిక కుటుంబాలు తమ ఉపాధి కోల్పోయాయి. ఈత వనం దగ్ధం కావడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు.ఘటన స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు.