05-04-2025 10:30:22 AM
తప్పిన పెను ప్రమాదం
బయటపడిన ప్రయాణికులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో స్కార్పియో హనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు ఆందోళన కు గురయ్యారు. భువనగిరి నుంచి వారిని మండలంలోని బడా పహాడ్ కు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న స్కార్పియో వాహనం కామారెడ్డి సమీపంలోని క్యాసంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై స్కార్పియో నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి.
డ్రైవర్ అప్రమత్తమై స్కార్పియోను ఆపివేసి అందులోని ప్రయాణికులను దింపి వేశారు. వెంటనే అందులోని ప్రయాణికులు దిగిన కాసేపటికి మంటలు చెలరేగాయని తెలిపారు. 100 డయల్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్కార్పియో నుంచి దిగి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అగ్నిమాపక శాఖ అధికారులను రప్పించి మంటలను ఆర్పి వేశారు. అప్పటికే స్కార్పియో వాహనం పూర్తిగా దగ్ధమైంది. దేవునిపల్లి ఎస్సై రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి కి చెందిన వారు బడాపహాడ్ దర్గా ను సందర్శించుకునేందుకు భువనగిరి నుంచి అర్ధరాత్రి బయలుదేరారు. ఎక్కడ ఆగకుండా రావడం వల్లే వాహనం పొగలు వ్యాపించి మంటలు వచ్చాయని పోలీసులు తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ వివరించారు. మరో వాహనం తెప్పించుకొని బడా పహాడ్ కు వారు బయలుదేరి వెళ్లారు.