19-04-2025 05:06:02 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం నిమ్స్ ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఎమర్జెన్సీ విభాగంలో భారీగా మంటలు ఎగిసిపడాయి. ఆస్పత్రి పరిసర ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకోవబంతో రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని మంటలు అటుకున్నట్లు గమనించిన సిబ్బంది వేంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అదించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంక తెలియాల్సి ఉంది.