calender_icon.png 11 February, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

10-02-2025 09:08:34 AM

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో దివాన్ దేవ్డీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మదీనా-అబ్బాస్ టవర్స్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న బట్టల దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు పది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అయితే, మంటలు సమీపంలోని పలు దుకాణాలకు వ్యాపించాయి. దీంతో ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమానులు తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత ప్రాంతంలోని వ్యాపార యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిమాపక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.