15-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : నగరంలోని బంజారాహిల్స్ లో గల పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం స్వల్ఫ అగ్నిప్రమాదం జరిగింది. ఆ హోటల్ మొదటి అంతస్తులోని ఓ రూంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలా ర్పారు. ప్రమాదం వల్ల హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఉద్రిక్తతత పరిస్థితులు నెలకొన్నాయి.
హోటల్‌లో బస చేసిన వారు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని హోటల్ నిర్వాహకులు తెలిపారు. కాగా నగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఆటగాళ్లు ఈ హోటల్‌లోనే బస చేస్తుండడం విశేషం. సోమవారం ఉదయమే ఈ హోటల్ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు వెళ్లిపోయారు.