రాజేంద్రనగర్, జనవరి 3: కోకాపేట్‌లోని నియోపోలీస్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నియోపోలీస్‌లో మైహోం గ్రూపు నిర్వాహకులు భారీ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఈక్రమంలో నిర్మాణంలో ఉన్న ఓ టవర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని సిబ్బంది చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.