17-04-2025 01:09:23 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: మణికొండ మున్సిపల్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద బుధవారం మంటలు చెలరేగినట్లు స్థానికు లు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు పక్కన హై టెన్షన్ వైర్ల కింద మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో అనుమతి లేకుండా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్దూర్ నిద్ర వీడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.