మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి): నగరంలోని కొండాపూర్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్రా కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూంలో ఉద్యోగులు విధులు ముగించుకొని వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. షోరూం ప్రధాన రోడ్డుపై ఉండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. షోరూంలో 1౫కు పైగా కార్లు ఉన్నట్లు సమాచారం. కాగా మంటలు పక్కన ఉన్న దుకాణాలకు కూడా అంటుకున్నట్లు సమచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.