19-02-2025 11:27:15 AM
మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ బస్ డిపో( Kushaiguda RTC Bus Depot) వద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో రెండు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగి మరో బస్సుకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. బస్సు ఇంజన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.