12-03-2025 12:32:32 AM
కుత్బుల్లాపూర్, మార్చ్ 11(విజయ క్రాంతి): జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఖాళీ స్థలంలో డంప్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ శివాలయ సమీపంలో ఖాళీ స్థలం లో ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు ప్లాస్టిక్ ట్రేలను డంప్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వాటికి నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలతో పాటుగా ఒకేసారి భారీగా పొగలు వ్యాపించడంతో స్థానికంగా ఉండేవారు భయభ్రాం తులకు గురయ్యారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.