calender_icon.png 23 March, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

22-03-2025 10:49:08 PM

మందుల స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు

ఆందోల్: సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘోర  అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రి ప్రాంగణంలోని మందుల స్టోరీ కి రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చేరేగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనస్థలికి చేరుకొని మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు. దహనంలో పంపించిన మంటలలొ స్టోర్ చేసిన మందులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. భారీగా నష్టం సంభవించింది. ఆసుపత్రిలోని రోగుల గదులకు కొంచెం దూరంగా ఈ స్టోర్ ఉండడంతో రోగులకు పెను ప్రమాదం తప్పింది.