21-04-2025 12:14:42 AM
వనపర్తి టౌన్ ఏప్రిల్ 20: వనపర్తి జిల్లాలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల లో బాగంగా చివరి రోజు 20 వ రోజు అగ్నిమాపక కేంద్రం వనపర్తి నందు పబ్లిక్ కు వర్క్ షాప్ ,స్టాల్స్ ఏర్పాటు చేసి అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు.
అగ్నిప్రమాదంలో చిక్కినపుడు ఎలా రెస్క్యూ చేయాలో L. P. G. గ్యాస్ లీకైనపుడు ఆయిల్ ఫైర్స్ అయినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైర్ ఎక్సటింగ్ సిలిండర్స్ ఎలా ఉప యోగించాలి.
అనే విషయాలపై అవగాహన కల్పించారు మరియు ఫైర్ వెహికల్స్ తో అగ్నిమాపక కేంద్రం నుండి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి ,పబ్లిక్ కు కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.