22-02-2025 11:47:19 AM
కర్మన్ ఘాట్ లోని మణికంఠ టింబర్ డిపోలో మంటలు
ఎల్బీనగర్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి(Saroornagar Police Station Range)లోని కర్మాన్ ఘాట్ లో ఉన్న శ్రీ మణికంఠ టింబర్ డిపో(Sri Manikanta Timber Depot) లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పారు. అగ్నిమాపక అధికారి శ్రేణయ్య మాట్లాడుతూ.. 'మాకు రాత్రి 11:07 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. ఎల్బీ నగర్, హయత్ నగర్, మలక్‌పేట్ నుంచి మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు అరగంట పట్టింది. అగ్నిప్రమాదానికి కారణం, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఘటనపై దర్యాప్తులో ఉంది.
మణికంఠ టింబర్ డిపో యజమాని(Manikanta timber depot owner) మాట్లాడుతూ.. 2002లో మణికంఠ టింబర్ డిపో పేరుతో దుకాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత నుంచి యధావిధిగా నడుపుతున్నామని తెలిపారు. కాగా , శుక్రవారం రాత్రి 7:30 గంటలకు రోజువారీ పనులు ముగించుకుని రాత్రి 8 గంటలకు షాపు మూసేశామమన్నారు. అయితే షార్ట్‌సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై స్థానిక రిపోర్టర్ ఫోన్ ద్వారా తెలియజేశారు. షాపులో దాదాపు రూ. 80 నుంచి రూ. 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు.