ఏడు మంది కార్మికులకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ఇద్దరి పరిస్థితి విషమం..
పటాన్ చెరు: జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీకర ఆర్గానిక్స్ రసాయన పరిశ్రమలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద సెంటర్ ఫ్యూజ్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు, పేలుడు ధాటికి గోడ కూలడంతో మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో బ్రిజేష్, ఈశ్వర్ చంద్ర, పుష్ప రాజ్, సుందర్ సింగ్, చంద్ ప్రతాప్, షేక్ అన్వర్, నీలేష్ సింగ్ ఉన్నారు. వారిని మదీన గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.