12-04-2025 10:08:14 PM
రాజేంద్రనగర్: మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నంపూర్ చెరువు వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి 9 గంటలకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంటలు భారీ ఎత్తున చెలరేగాయని స్థానికులు తెలియజేశారు.