కాలిబూడిదైన ఐదు బైక్‌లు
మలక్‌పేట, డిసెంబర్ 6: మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద ప్రమాదవ శాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో అక్కడ పార్క్‌చేసిన బైక్‌లు కాలిబూడిద్యయాయి. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైక్‌ల నుంచి శుక్రవారం సాయంత్రం మం టలు చెలరేగడం ప్రారంభించాయి. స్థానికుల సమాచారం మేరకు మలక్‌పేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.