ప్రయాగ్ రాజ్,(విజయక్రాంతి): ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరొకసారి అపశృతి చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 18లోని శంకరాచార్య మార్క్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. నష్టం ఎంతవరకు జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు.