calender_icon.png 6 February, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం

06-02-2025 01:01:04 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5: లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 6 పక్కన ఉన్న పూరి గుడిసెల్లో బుధవారం సా  అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమా  జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు బకెట్లతో నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. పిల్లలు బయట చెత్తను తగలబెట్టే క్రమంలో పక్కనే ఉన్న గుడిసెలకు అంటుకుని గుడిసెలు తగలబడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుడిసెల్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.