calender_icon.png 29 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడిమెట్లలోని ఎలక్ట్రికల్ కంపెనీలో అగ్నిప్రమాదం

29-04-2025 09:36:25 AM

జీడిమెట్ల,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభావించింది. సోమవారం అర్థరాత్రి తర్వాత కేకేసీ ఎలక్రికల్ టేబుల్ ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అది గమనించిన స్థానికులు వేంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. సోమవారం ఫ్యాక్టరీకి సెలవు కావడంతో కార్మికులు ఎవరు లేరాని, ప్రాణనష్టం తప్పినట్లు పోలీసులు తెలిపారు. షాట్ సర్కిట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందననట్లు ప్రాథమికంగా అంచనావేసినట్లు మేడ్చల్ అగ్నిమాపక అధికారి జయకృష్ణ తెలిపారు.