కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని కౌటాల మండలం ముత్యంపేట సమీపంలో బుధవారం పత్తి వ్యానుకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. బాధితుడు నేరెళ్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ నుండి మహారాష్ట్రకు పత్తి లోడుతో వెళుతుండగా కౌటాల నర్సరీ వద్ద షార్ట్ సర్క్యూట్తో పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో వ్యాన్ ముందు భాగం పూర్తిగా కాలిపోగా పత్తి సగానికి పైగా కాలినట్లు తెలిపారు. నిప్పు అంటుకుని దాదాపు రెండు గంటలు దాటినప్పటికీ ఫైర్ సర్వీస్ లేకపోవడంతో సమీపంలోని క్రషర్లకు సంబంధించిన ట్యాంకర్ తో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిఐ రమేష్, ఎస్ఐ మధుకర్ అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టారు. పెద్దన మండలంలోని జాతీయ రహదారి పక్కన సంతోష్ హోటల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు చెడరేగాయి. యజమాని అరుపులు పెట్టడంతో హుటాహుటిన ఘటన స్థలానికి స్థానికులు చేరుకొని ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.