29-04-2025 11:46:16 PM
22 మంది మృతి.. ముగ్గురికి గాయాలు..
స్పందించిన అధ్యక్షుడు జిన్ పింగ్..
బీజింగ్: చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో గల లియోయాంగ్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో 22 మంది మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ నెలలో చైనాలో ఇది రెండో అతిపెద్ద అగ్నిప్రమాదం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధ్యక్షుడు అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.