పెద్ద ఎత్తున ఆస్తినష్టం..
పక్కన పరిశ్రమలకు అంటుకున్న మంటలు..
కాప్రా: చర్లపల్లి పారిశ్రామికవాడ పేజ్ లోని సర్వోదయ కెమికల్ పరిశ్రమ(Sarvodaya Chemical Industry)లో సల్వేంట్లలో మంటలు చేలరేగి పెద్ద ఎత్తున అంటుకున్నాయి. పోలీసులు ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం నుంచి పని చేసిన 22 మంది కార్మికులు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పని పూర్తి చేసుకుని వెల్లిపోయారు. సాయంత్రం 06 గంటల 40 నిమిషాలకు పరిశ్రమలోని సల్వేంట్ల గదిలో మంటలు ప్రారంభమై క్రమక్రమంగా పెద్ద ఎత్తున చేలరేగాయి. కెమికల్ పరిశ్రమ కావడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు, పోగలు చేలరేగాయి. పక్కన ఉన్న ఫ్లోరషిల్డ్, మహలక్ష్మి రబ్బర్ కంపెనీ, హరిత ఇండస్ట్రీన్ కంపెనీ(Harita Industries Company)లకు మంటలు అంటుకున్నాయి.
సర్వోదయ కెమికల్ పరిశ్రమ పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా ఫైర్ అఫిసర్ శ్రీనివాస్(Medchal District Fire Officer Srinivas), చర్లపల్లి ఫైర్ అధికారి రంజిత్రెడ్డి(Charlapalli Fire Officer Ranjithreddy) హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు చేలరేగిన సమయంలో కార్మికులు లేకపోవడంలో ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు. కుషాయిగూడ ఏసిపి మహేష్ కుమార్ గౌడ్, చర్లపల్లి సిఐ రవి కుమార్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు పర్యావేక్షించారు. పక్కన ఉన్న పరిశ్రమలకు మంటలు అంటుకోవడంతో ఆస్తినష్టం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న చర్లపల్లి ఐలా చైర్మాన్ జెక్క రోషిరెడ్డి పరిశ్రమల యాజయానులతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.