calender_icon.png 26 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ కేంద్రంలో అగ్నిప్రమాదం

26-11-2024 12:59:08 AM

మంటలను ఆర్పుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ఫైర్ సిబ్బంది

15 క్వింటాళ్ల పత్తి దగ్ధం

జనగామ, నవంబర్ 25 (విజయక్రాంతి): పత్తి కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులోని బా బా తాజుద్దిన్ సైలానీ కాటన్ ఇండస్ట్రీస్‌లో జరిగింది. బాబా తాజుద్దిన్ సైలానీ కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సుమా రు 5 వేల క్వింటాళ్ల పత్తి నిల్వ ఉంది. సోమవారం ఉదయం 10:30 గంటల సమ యంలో నిల్వ చేసిన పత్తి కుప్పలోంచి అకస్మాత్తుగా మంటలు లేచాయి.

గమనించిన వాచ్‌మన్ నిర్వాహకులకు తెలపడంతో అక్కడున్న కూలీలు, సిబ్బందంతా అప్రమత్తమై కొనుగోలు కేంద్రంలో ఫైర్ సేఫ్టీలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి పంపులతో మంటలపై పంపింగ్ చేశారు. సమాచారమందుకున్న జనగామ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అరగంటలోనే మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 15 క్వింటాళ్ల వరకు పత్తి కాలిపోయిందని, సమయానికి నీరు చల్లడం వల్ల భారీ నష్టం తప్పిందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తెలిపారు. జనగామ సీఐ దా మోదర్‌రెడ్డి, ఫైర్ అధికారి శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.