05-03-2025 01:24:07 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): అంబర్‌పేట్ ఫ్లుఓవర్ సమీపం లో మంగళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లుఓవర్ నిర్మాణ సామగ్రి, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లుఓ సం బంధించిన వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్ర మాదం జరిగినట్టు తెలుస్తున్నది.
భారీగా ఎ గిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదా రులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.