హైదరాబాద్: మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింది శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. వామనాలకు మంటలు అంటుకుని భారీగా పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో 5 బైక్‌లు దగ్ధమయ్యాయి. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింద దట్టంగా అలుముకున్న పోగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్ పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదంతో చాలాసేవా వాహనాలు ఆగిపోయాయి. దీంతో మలక్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగను గమనించిన ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.