04-04-2025 12:18:02 AM
ఖమ్మం, ఏప్రిల్ 3 (విజయక్రాంతి ):- ఖమ్మం నగర శివారు లోని వెలుగుమట్ల పార్క్ లో గురువారం రాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచాయి. పార్క్ లో మంటలు చెట్లకు అంటుకోవడంతో మంట లు తీవ్రత పెరగడంతో భారీగా చెట్లు కాలిపోయాయి. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగిన ట్లు తెలుస్తోంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలతో అటవీ, రెవిన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని, మంటలను ఫైర్ సిబ్బంది తో అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. పార్క్ లో ఉన్న వన్య ప్రాణులను రక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్క్ లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, పార్క్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.