calender_icon.png 17 January, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్‌పేటలో అగ్నిప్రమాదం

17-01-2025 11:12:07 AM

హైదరాబాద్: నగరంలోని షేక్‌పేట(Shaikpet)లోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షేక్‌పేట్ రోడ్డులో ఉన్న వాణిజ్య భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. “భవనంలోని రెండవ అంతస్తులో ఉన్న మెడికల్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. వేగంగా కోచింగ్ సెంటర్‌(coaching centre)కు వ్యాపించాయి.

రెండవ, మూడవ అంతస్తులో మంటలు ఎక్కువయ్యాయి,”అని ఒక అధికారి తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్ ఉండడంతో మంటలు వ్యాపించడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. వివిధ స్టేషన్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది.. ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.