17-03-2025 09:10:06 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) రాచన్నపేటలో సోమవారం అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో సాయికృప కోత మిల్లులో మంటలు చెలరేగాయి. కోత్త మిల్లు పక్కనే ఉన్న టింబర్ డిపో(Timber Depot )కు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో కోత మిల్లులోని కలప దగ్ధం అయింంది. పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.