27-04-2025 12:20:05 AM
కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలో అగ్ని ప్రమాదం
బూడిదైన 500 గుడిసెలు.. రోడ్డునపడ్డ పేదలు
దీపం అంటుకుని మంటలు: రాచకొండ సీపీ
ఎల్బీనగర్, ఏప్రిల్ 26: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని కుంట్లూరు శివారులోని రావినారాయణరెడ్డి కాలనీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 500ల గుడిసెలు కాలిబూడిదయ్యాయి. దీంతో వేలాది మంది పేదలు రోడ్డునపడ్డారు. శనివారం ఉదయం గుడిసెల్లో నివసించే పేదలందరూ పొట్టకూ టి కోసం పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు గుడి సెలకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగ డంతో గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి, ఒక గుడిసె నుంచి మరో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న హయత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఒక గుడిసెలో దేవుడి పూజ కోసం పెట్టిన దీపం ఆ గుడిసెకు అంటుకుని, మంటలు చెలరేగాయనిచ, గుడిసులన్నీ పకపక్కనే ఉండటంతోపాటు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంట లు వచ్చాయని ప్రాథమిక అంచానకు వచ్చినట్లు తెలిపారు. జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, అగ్నిప్రమాదంపై దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హయత్‌నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు. ప్రమాదంలో అనేక మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టాలని -సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఆందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. కాగా రావినారాయణరెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 4 మంది పేదలు గుడిసెలు వేసుకుని, ఇండ్ల జాగ కోసం నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్నారు.