calender_icon.png 19 April, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం

19-04-2025 09:07:17 AM

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ హౌస్ గోడౌన్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fireaccident) సంభవించింది. సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. సీనియర్ అధికారులు కూడా మంటలు చెలరేగిన ప్రదేశానికి చేరుకున్నారు. మంటల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. నల్లటి పొగ మొత్తం ప్రాంతమంతా వ్యాపించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దృశ్యాలలో, గోడౌన్ నుండి భారీ మంటలు ఎగసిపడుతున్నట్లు కూడా చూడవచ్చు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.