14-04-2025 12:37:27 AM
రూ.12 లక్షల మేర ఆస్తినష్టం
అశ్వారావుపేట, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): అశ్వారావుపేట మండలంలోని దురదపాడు పంచాయతీలోని పాలగుంపులో ఆదివారం సాయంత్రం విద్యుదాఘా తంతో మూడు పూరిండ్లు దగ్ధమయ్యాయి. మండలంలోని పాలగుంపులో నల్లవెల్లి స్వ ప్న ఇంటిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి.
ఆసమయంలో ఇంట్లో, ఎవరూ లేరు. అందరూ కూలిపనులకు వెళ్లారు. అదే సమయంలో ఈదురు గాలులు వీయటంతో ఇంటికి అటువైపు ఇటువై బలమైన మంటలు అరగంటలోనే మూడు నివాసాలు అగ్నికి ఆహుతి అయ్యా యి. ప్రమాదం వలన దాదాపు రూ.12లక్షల వరకు నష్టం వాటిల్లునట్లుగా సమాచారం. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేరు ఇంటికి అటువైపు ఇటువై పున ఉన్న మడకం రాజు, కొర్సా భద్రమ్మ ఇంటికి కూడా మంటలు అలుముకున్నాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఇళ్లలో ఉన్న వస్తువులకు కూడా బయటకు తీసుకువచ్చే అవకాశం లేదు. ఊరంతా అక్కడికి వచ్చినా మంటలు బలంగా ఉం డటంతో ఆర్పటం సాధ్యం కాలేదు. దాదాపు అరగంటలోనే మూడు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో గిరిజనులకు కట్ట బట్టలే మిగిలాయి. ప్రమాదంలో మడకం రాజు ఇంట్లో ఉన్న దాదాపు రూ.3.80లక్షల విలువైన బంగారం, ఇంటి నిర్మాణం కో సం తెచ్చిన రూ.5 లక్షల నగదు, ఇంట్లో సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్స్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
ఇంటి బయట ఉన్న ఆటోను మాత్రం బయటకు తీసుకువచ్చారు. నల్లవెల్లి స్వప్న ఇంట్లో ఉన్న క్వింటన్నర జీడిగింజలు, రూ.5 వేల నగదు, బంగారు గొలుసు, మంచాలు, బీరువా ఇలా అన్ని రకాల సామాగ్రి కాలిపోయింది. కొర్సా భద్రమ్మ నివాసంలోనూ అన్ని వస్తు వులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం వలన దాదాపు రూ.12లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాదితులు తెలిపారు. ప్ర మాదం వలన నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాదితులు రాజు, స్వప్న వేడుకున్నారు