calender_icon.png 9 January, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ కృష్ణాస్ కిచెన్‌లో భారీ అగ్నిప్రమాదం

08-01-2025 04:10:02 PM

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాస్ కిచెన్(Krishna's Kitchen)లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవింది. కృష్ణాస్ కిచెన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదంలో పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను మార్పేందుకు శ్రమిస్తున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.