calender_icon.png 26 April, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

26-04-2025 02:04:01 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధి(Hayat Nagar area) కుంట్లూరులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి కాలనీ(Ravi Narayana Reddy Colony) సమీపంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కాలనీ సమీపంలోని పేదలు వేసుకున్న గుడిసెల్లో అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కి పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీగా మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.