calender_icon.png 15 April, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం

13-04-2025 03:07:13 PM

బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు

భారీగా ఎగిసిపడుతున్న మంటలు

మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం(Kotauratla Mandal) కైలాసపట్నంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.