calender_icon.png 16 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తిలో అగ్నిప్రమాదం

15-03-2025 12:52:11 AM

కల్వకుర్తి మార్చ్14 : పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.  చెలరేగిన మంటలకు అతి  సమీపంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక శాఖ అధికారుల సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో  ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని, చెట్లపొదల్లో ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల సమీపంలో ఉన్న చెట్లు , ఎండుగడ్డి అంటుకోవడంతో మంటలు చెలరేగాయని  అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

పట్టణ నడిబొడ్డున ఉన్న బొక్కల కుంట ప్రాంతంలో  కంపచెట్లు విపరీతంగా ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.