calender_icon.png 12 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడిమెట్ల సుభాష్ నగర్‌లో అగ్నిప్రమాదం

11-03-2025 02:03:46 PM

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి(Jeedimetla Police Station Area)లోని సుభాష్ నగర్ లో మంగళవారం అగ్నిప్రమాదం(Fire accident) సంభవించంది. ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ కమ్మేసింది. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.