calender_icon.png 22 April, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

18-04-2025 01:01:10 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 17 : పటాన్ చెరు మండలం పాశమై లారం పారిశ్రామిక వాడలోని వెన్ కార్ కెమికల్స్ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 9గంటల సమ యంలో విధులు నిర్వహిస్తుండగా సాల్వెంట్ వద్ద మంటలు ఏర్పడి ప్లాంట్ అంతటా వ్యాపించాయి. దీంతో పరిశ్రమ కార్మికులు, చుట్టు పక్కల ఉన్న రసాయన పరిశ్రమలు వెంటనే అప్రమత్తమ య్యాయి.

ఏర్పడిన మంటలను వాటర్ ఫోమ్తో అదుపులోకి తీసుకొచ్చారు. పాశ మైలారం ఐలా ఆధ్వర్యంలోని ఫైర్ ఇంజన్ లు వాటర్ ఫోమ్ తో  ఉదయం 11:30 వరకు మంటలు పూర్తిగా ఆర్పేశారు. బీడీఎల్ భానూర్ సీఐ స్వామి గౌడ్ పరిశ్రను పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని కార్మికులు తెలిపారు.