calender_icon.png 14 March, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి హోటల్లో చెలరేగిన మంటలు

14-03-2025 04:45:49 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఓ హోటల్ ఎలక్ట్రికల్ నేమ్ బోర్డ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద నగర్ కాలనీ కమాన్ వద్ద ఉన్న పల్లవి హోటల్ లో నేమ్ బోర్డ్ లో  షార్ట్ సర్క్యూట్ చెలరేగి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలోని అందులో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మంటల ని ఆర్పేందుకు ప్రయత్నించాడు. దీంతో అతని రెండు చేతులు స్వల్పంగా కాలి గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలని ఆర్పివేశారు. అర్ధరాత్రి కావడంతో ప్రమాదవశాత్తు హోటల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. హోటల్ నిర్వాహకులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.