calender_icon.png 6 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

13-12-2024 01:36:46 AM

చెన్నై, డిసెంబర్ 12: తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలుడు సహా ఆరుగురు చనిపోయి నట్టు సమాచారం. ఆసుపత్రిలో ఉన్న మిగతా వారిని దిండిగల్ ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు.

అగ్ని కీలలను చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్లు అధికారులు ప్రకటించారు. కలెక్టర్‌తోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నా రు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు. ‘ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.