01-04-2025 02:17:12 AM
ఎల్బీ నగర్, మార్చి 31: హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పీఅండ్‌టీ కాలనీలో ఎల్ల య్య అనే వ్యక్తి కి చెందిన స్క్రాబ్‌గోదాంలో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో గోదాం పూర్తిగా దగ్ధమై పోయింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికుల వెంటనే పోలీసులు, ఫైర్‌సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన మూడు ఫైర్‌ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్‌ఇంజిన్లు మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలోనూ ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.
ఈ ఘటనలో సుమారు రూ.20లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై హయత్‌నగర్‌పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇతర ఏదైనా కారణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో గౌడౌన్లో కార్మికులు లేరని చెప్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి