ఎస్అండ్ఎస్ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఘటన
షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ ఎస్ అండ్ ఎస్ హోమ్స్ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ ఎస్ అండ్ ఎస్ హోమ్స్ ప్లాట్ నెంబర్స్ 367, 368 లో శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అపార్ట్మెంట్ లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కాగా అదే సమయంలో ఫ్లాట్స్ లో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులను ఫైర్ సేఫ్టీ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అయితే షార్ట్ సర్ఫుట్ కు గురైన భవనానికి కనీస సేఫ్టీ మెజర్స్ లేకపోవడం గమనర్హం. షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.