calender_icon.png 14 January, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

08-11-2024 12:49:08 AM

ముషీరాబాద్, నవంబర్ 7: ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని వైష్ణవి వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిర్వాహకుడు సందీప్ దుకాణంలోని ఫర్నీచర్‌కు చెదల మందుకొట్టి.. అనంతరం దుకాణాన్ని మూసి వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పై అంతస్తులోని వారు గమనించి యజ మానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బది హూటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, దుకాణం షట్టర్ ఎంతకూ తెరుచుకోకపోవడంతో జేసీబీని రప్పించి షట్టర్‌ను తొలగించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉందని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.