calender_icon.png 20 March, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్వెన్షన్ హాల్ లో భారీ అగ్నిప్రమాదం

20-03-2025 11:34:55 AM

శంషాబాద్ తొండుపల్లి లో ఘటన

భారీగా ఎగిసిపడుతున్న మంటలు  

రాజేంద్రనగర్: ఓ కన్వెన్షన్ హాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన శంషాబాద్ మండల(Shamshabad Mandal Area) పరిధిలోని తొండుపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తొండుపల్లి గ్రామంలోని ఈకేఎఎం కన్వెన్షన్ హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడటంతో పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. మంటలు భారీగా రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు. శంషాబాద్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.