యాదాద్రి భువనగిరి, జూలై 11 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దొంతిగూడెంలోని ఓ పరిశ్రమలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుం ది. విత్తన ఉత్పత్తులకు సంబంధించిన ఓజో పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బం ది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా బీబీ నగర్‌లోని సాయి సిమెంట్ ట్రేడర్స్ అనే దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.