10-04-2025 08:16:01 AM
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-1లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బాక్టోలాక్ ఫార్ములేషన్స్ ప్రైవేటు కంపెనీ(Bactolac Formulations Private Company)లో ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. రెండో అంతస్తులో ఉన్న కంపెనీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన సిబ్బంది అగ్నిమాపక శాఖ(Fire Department)కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.