- సర్వోదయ కెమికల్ పరిశ్రమలో ఘటన
- పక్కన పరిశ్రమలకు అంటుకున్న మంటలు
- భారీ మొత్తంలో ఆస్తి నష్టం?
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి)/కాప్రా: చర్లపల్లి ఎన్‌ఎఫ్‌సీ ఫేజ్ లోని సర్వోదయ కెమికల్ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం అగ్ని చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి పని చేసిన 22 మంది కార్మికులు సాయంత్రం 5:30 గంటలకు పని పూర్తి చేసుకుని వెల్లిపోయారు.
సాయంత్రం 6:40 గంటలకు పరిశ్రమలోని సల్వేంట్ల గది మంటలు చేలరేగాయి. రసాయన పరిశ్రమ కావడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సం పొగలు అలుముకున్నాయి. పక్కన ఉన్న ఫ్లోరషిల్డ్, మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ, హరిత ఇండస్ట్రీస్ కంపెనీలకు మంటలు అంటుకున్నాయి.
సర్వోదయ కెమికల్ పరిశ్రమ పూర్తిగా కాలిపోయింది. మేడ్చల్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, చర్లపల్లి అధికారి రంజిత్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.
మంటలు చేలరేగిన సయమంలో కార్మికులు లేకపోవడంలో ప్రాణనష్టం జరగలేదు. పక్కన ఉన్న పరిశ్రమలకు మంటలు అంటుకోవడంతో ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తున్నది.